ELR: మండవల్లి మండలంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. కైకలూరు మండలం రాచపట్నం గ్రామానికి చెందిన అందుగుల పర్సయ్య (40) చేపల చెరువుల వద్ద గుమస్తాగా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా బుధవారం బైక్పై చెరువు వద్దకు వెళ్తుండగా.. చావలిపాడు మహిళా మండలి కాలనీ సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడే మృతి చెందాడు