KNR : తెలంగాణలో వ్యవసాయం చేయాలంటే రైతులు భయపడే పరిస్థితి వచ్చిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ బొమ్మకల్లోని ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మంత్రులు అధికారుల మధ్య సమన్వయం లేదని అన్నారు. రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు.