KRNL: కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు పంచ్ ప్రభాకర్ శకునిలా వ్యవహరిస్తున్నాడని బుధవారం మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ విమర్శించారు. కర్నూలులోని తన కార్యాలయంలో ఆర్యవైశ్య రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్యతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ధైర్యం ఉంటే ప్రభాకర్ ఇండియాకు రావాలని సవాల్ విసిరారు. వైశ్యుల జోలికి వస్తే సహించబోమని ఈ మేరకు టీజీ వెంకటేష్ హెచ్చరించారు.