NRML: జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు, ప్రజల భద్రత కోసమే కార్డెన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 75 ద్విచక్ర వాహనాలు, ఐదు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. రూ. 42,380 పెండింగ్ చలాన్లు వసూలు చేశారు.