కృష్ణా: గుడివాడలో పూర్ణచంద్రరావు కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గురువారం టీడీపీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకి బలమని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను, చంద్రబాబు విజన్‌ను ప్రతి గడపకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.