GDWL: మల్దకల్ మండలం మద్దెలబండ గ్రామంలో జరుగుతున్న శ్రీ గోకరమయ్య స్వామి ఉత్సవాల్లో బుధవారం ఒక చిన్న పాప తప్పిపోయినట్లు స్థానికులు తెలిపారు. దీంతో పాపని కమిటీ సిబ్బంది తమ వద్ద క్షేమంగా ఉంచుకున్నారు. ఆ పాప కోసం తల్లిదండ్రులు కూడా ఎవరూ రాకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాపను ఎవరైనా గుర్తిస్తే స్థానిక పీఎస్లో, ఉత్సవ కమిటీని సంప్రదించాలని కోరుతున్నారు.