MDCL: ఉప్పల్, కాప్రా సర్కిళ్లలో చెత్త వేయకుండా నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, మైకులు పనిచేయకపోవడంతో మళ్లీ చెత్త కుప్పలు పెరుగుతున్నాయి. తొలుత మంచి ఫలితాలు ఇచ్చిన ఈ వ్యవస్థ అధికారుల నిర్లక్ష్యంతో దెబ్బతింది. పలు చోట్ల కెమెరాలు మూగబోగా, కొన్ని దొంగతనానికి గురయ్యాయి. దీంతో నాలాలు, ఖాళీ స్థలాల్లో మళ్లీ చెత్త వేస్తున్నారు.