కోనసీమ: అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో జిల్లాస్థాయి కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నంబర్ 1912 ఏర్పాటు చేసినట్లు APEPDCL సూపరెంటెండింగ్ ఇంజనీర్ బి.రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో విద్యుత్ వినియోగం పెరిగినప్పటికీ, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా సరఫరా కొనసాగించేందుకు అన్ని డివిజన్, సర్కిల్ కార్యాలయాలలో ఏర్పాటు చేశామన్నారు.