GDWL: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని బుధవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, సతీమణి కవితా మధుసూదన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులచే స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..స్వామివారి ఆశీస్సులతో దేవరకద్ర నియోజకవర్గం అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు.