MDCL: ప్రజలకు వినోదంతో పాటు పర్యావరణం, ఆరోగ్యం, సంస్కృతిపై అవగాహన కల్పించేందుకు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కొత్త థీమ్ పార్కుల అభివృద్ధికి సిద్ధమైంది. ఇప్పటికే ఉన్న 11 థీమ్ పార్కులు ప్రజలను ఆకట్టుకుంటుండగా, మరో 15 పార్కులకు ప్రణాళికలు రూపొందించారు. స్పోర్ట్స్ పార్క్, బటర్ఫ్లై పార్క్, మ్యూజికల్ పార్క్, పేట్రియాటిక్ పార్క్ రానున్నాయి.