నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్ రోడ్డులో బుధవారం ఏర్పాటు చేసిన మహానాడు కార్యక్రమం ఘనంగా జరిగింది. క్లస్టర్-9లో రాష్ట్ర మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పాల్గొని టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్కు నివాళులు అర్పించి మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యక్ష ప్రసారాన్ని మంత్రి వీక్షించారు.