GDWL: అయిజ మండలం వెంకటాపురం శివారులోని శ్రీ గట్టు తిమ్మప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఏబీవీపీ విద్యార్థి సంఘం సభ్యులు బుధవారం పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం చేపట్టారు. భక్తులు వాడి పారేసే ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్ల వల్ల ఆలయ పరిసరాలు కలుషితం అవుతుండటాన్ని గమనించిన విద్యార్థులు, అక్కడ డస్ట్బిన్లను ఏర్పాటు చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.