HYD: వేసవి రద్దీతో సికింద్రాబాద్, చర్లపల్లి, నాంపల్లి, బేగంపేట రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో నిండిపోతున్నాయి. ఈ రద్దీని ఆసరాగా చేసుకుని అంతర్రాష్ట్ర దొంగలు చోరీలకు తెగబడుతున్నారు. సికింద్రాబాద్ జీఆర్పీ పరిధిలో నాలుగు నెలల్లోనే 254కు పైగా చోరీ కేసులు నమోదవ్వడంతో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు.