నల్గొండ: వేములపల్లి మండల కేంద్రంలోని ఆమనగల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత దేశబోయిన వెంకట్రాములు( 76) అనారోగ్యానికి గురై మరణించారు. ఈ సందర్భంగా బుధవారం తన నివాసంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ వెంకట్ రాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి ఓదార్చారు.