HNK: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని, ప్రస్తుతం కార్మికులు గోసపడుతున్నారని మాజీ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హనుమకొండలో కార్మిక, ఉద్యోగ చైతన్య మాసోత్సవంలో భాగంగా కార్మిక సంఘాల నేతలతో దాస్యం సమావేశం అయ్యారు. కార్మిక వ్యతిరేక విధానాలను ప్రభుత్వాలు వెంటనే సంహరించుకోవాలని దాస్యం అన్నారు.