NDL: శ్రీశైలం ఆలయంలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి చెంచు గిరిజనులకు ఉచిత సర్వదర్శనాన్ని కల్పించినట్లు ఆలయ అధికారి అయ్యన్న తెలిపారు. గత ఏడాదిలో ముక్కోటి ఏకాదశి రోజున చెంచు గిరిజనుల కోసం ఉచిత సర్వదర్శనాన్ని ప్రారంభించినట్లు ఇవాళ అయ్యన్న తెలిపారు. ప్రతి నెలలో చివరి బుధవారం రోజున వారికి సర్వదర్శనం కల్పిస్తున్నామని ఆయన అన్నారు.