మార్కాపురం మండలం వేములకోటలో 2002 సంవత్సరపు ఓటరు జాబితాలోని ఓటర్లను ప్రస్తుత జాబితాలోని ఓటర్లను అనుసంధానం చేసే ప్రక్రియను జిల్లా కలెక్టర్ విజయ సునీత పరిశీలించారు. జూన్ 5 నాటికి అనుసంధాన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత బీఎల్వోలను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో శివరామిరెడ్డి ఎమ్మార్వో చిరంజీవి పాల్గొన్నారు.