PLD: నూజండ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) రెగ్యులర్ వైద్యుడిగా డాక్టర్ కౌశిక్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనకు పీహెచ్సీ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. గత కొంతకాలంగా ఇక్కడ శాశ్వత డాక్టర్ లేకపోవడంతో తాత్కాలిక వైద్యులతోనే పనులు సాగాయి. ఇప్పుడు పూర్తిస్థాయి డాక్టర్ను నియమించడంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.