CTR: సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తోంది. ఇందులో వచ్చే ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించింది. కానీ చిత్తూరు జిల్లాలో ఆశించిన మేర సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఇప్పటివరకు 945 సమస్యలపై వినతులు రాగా, కేవలం 135 సమస్యలనే పరిష్కరించారు. సమస్యల పట్ల రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.