KMM: కాంగ్రెస్ పాలనలో ఏ ప్రభుత్వ ఉద్యోగికి ప్రశాంతత లేదని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బుధవారం పెనుబల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామ దీపికల దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. గ్రామ దీపికలకు కనీస వేతనం రూ.20 వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే వారికి పదోన్నతి కల్పించాలని పేర్కొన్నారు.