నిజామాబాద్: మాజీ మంత్రి శనిగరం సంతోస్ రెడ్డి సతీమణి విజయరెడ్డి 2 రోజుల క్రితం HYDలో మృతి చెందారు. నేడు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ, పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నేడు మహాప్రస్థానానికి వెళ్లారు. మాజీ మంత్రి సంతోష్ రెడ్డిని పరామర్శించారు. అనంతరం విజయరెడ్డి పార్థీవదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.