TPT: తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేతుల మీదుగా జాబ్ మేళా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈనెల 29న తిరుపతి ఎస్వీసీసీ డిగ్రీ కళాశాలలో నిర్వహించే జాబ్ మేళాలో 17 కంపెనీల్లో 800కిపైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పదో తరగతి నుంచి పీజీ వరకు అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.