గద్వాల పట్టణం రాఘవేంద్ర కాలనీ 9వ వార్డులో బుధవారం పెన్షనర్ల ఫొటో ఐడెంటిఫికేషన్ కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్ రామలింగేశ్వర కాంళ్లే ఆదేశాల మేరకు వార్డు ఆఫీసర్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో అధికారులు లబ్ధిదారుల వివరాలు, ఫోటోలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేశారు. అర్హులైన పెన్షనర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.