MLG: గోవిందరావుపేట మండలం చల్వాయిలోని శ్రీలక్ష్మీ ఫంక్షన్ హాల్లో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే మహిళా వారోత్సవాలకు రాష్ట్ర మంత్రి సీతక్క హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దాలి నాగమణి బుధవారం పిలుపునిచ్చారు.