HNK: హన్మకొండ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జవహర్లాల్ నెహ్రూ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, నేతలు పూలమాలవేసి నివాళులర్పించారు. నెహ్రూ చూపిన బాటలో నడుస్తూ వారి ఆశయ సాధనకు కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఛైర్మన్ వెంకటరామిరెడ్డి అన్నారు. గ్రంధాలయ ఛైర్మన్ అజీజ్ ఖాన్, తదితరులు ఉన్నారు.