KMM: పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చింతకాని మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రవికుమార్ అన్నారు. బుధవారం చింతకాని మండలం చిన్నమండవలో డిప్యూటీ సీఎం సిఫార్సు మేరకు మంజూరైన రూ.60,500 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు.