MHBD: తొర్రూర్ మండలం ఎర్రసోమ్లా తండా వద్ద బుధవారం బస్సు–లారీ ఢీకొన్న ఘటన త్రుటిలో ప్రమాదాన్ని తప్పించింది. హైదరాబాద్ నుంచి తొర్రూర్ డిపోకు చెందిన లగ్జరీ బస్సు వస్తుండగా, ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న బస్సు అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.