KRNL: పాణ్యం నియోజకవర్గం క్లస్టర్-11 పరిధిలోని కల్లూరు అర్బన్ 41వ వార్డు వీకర్ సెక్షన్ కాలనీలో బుధవారం హైబ్రిడ్ మహానాడు-2026 కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. యువ నేత గౌరు జనార్దన్ రెడ్డి TDP జెండాను ఆవిష్కరించి, NTR చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ అభివృద్ధికి కృషి చేసిన సీనియర్ కార్యకర్తలను శాలువాలతో సత్కరించి అభినందించారు.