MDCL: మేడిపల్లిలోని విష్ణుపురి కాలనీ పార్క్ నిరుపయోగంగా తయారైంది. పార్క్లో చిన్న పిల్లలు ఆడుకునే పరికరాలు విరిగిపోయి శిథిలావస్థకు చేరుకున్నాయి. పార్క్లో చెట్లకు నీరు లేక ఎండిపోయి, పార్క్ పరిసరాలు చెత్త చెదారంతో నిండిపోయి ఇబ్బందిగా తయారయ్యాయి. పార్క్ దుస్థితిని అధికారులు, పాలకులు పట్టించుకుని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.