ఎన్టీఆర్: కంచికచర్ల క్లస్టర్ 9 పరిధిలో TDP మహానాడు బుధవారం వర్చువల్ విధానంలో ఏర్పాటు చేశారు. ముందుగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సందేశాలను టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా వీక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.