AP: SIRపై జాగ్రత్తగా ఉండాలని మాజీ సీఎం జగన్ తమ పార్టీ ముఖ్యనేతలకు సూచించారు. ‘ఇటీవల పశ్చిమబెంగాల్లో 91 లక్షల ఓట్లు (దాదాపు 11.9 శాతం) తీసేశారు. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తొలగించారు. దీని వల్లే ఆ రాష్ట్రంలోని వారు ఓటమి పాలయ్యారు. మనం ఓట్లు పెరగడం వల్ల ఓడితే.. ఆ రాష్ట్రాల్లో ఓట్లు తీసేయడం వల్ల ఓడారు. ఈ రెండు ప్రమాదమే. కుప్పంలో బోగస్ ఓట్లు చాలా ఉన్నాయి’ అని ఆరోపించారు.