KMR: బిక్కనూర్ మండల కేంద్రంలో తెల్లవారుజామున కురిసిన వర్షానికి పిడుగు పడి పాడిగేదె మృతి చెందింది. మండల కేంద్రానికి చెందిన బాధిత రైతు శివయ్య తన వ్యవసాయ బావి వద్ద ఉన్న పశువుల కొట్టంలో గేదెలను కట్టేశారు. ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా పిడుగు పడటంతో గేదె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై బాధిత రైతు పశువైద్యాధికారులకు సమాచారం అందించాడు.