WNP: వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ గోపాల్పేట పోలీసులు అవగాహన పోస్టర్ విడుదల చేశారు. ఉరుములు, మెరుపులు, భారీ వర్షాల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై శశిధర్ పేర్కొన్నారు. విద్యుత్ పరికరాలు తనిఖీ చేయడం, నీటిలో నడవకపోవడం, చెట్ల కింద నిలబడకపోవడం వంటి సూచనలు చేశారు. అత్యవసర సమయంలో 100కు ఫోన్ చేయాలని తెలిపారు.