BHNG: రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షం రైతు కుటుంబంలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన పోషబోయిన ఎర్రయ్యకు చెందిన ఎద్దు పిడుగుపాటుకు మృతి చెందింది. ఒక్కసారిగా వాతావరణం మారి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ సమయంలో మెరుపులతో పాటు పిడుగు పడటంతో పొలంలో ఉన్న ఎద్దు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.