HYD: తీవ్రమైన ఎండలు, ఐపీఎల్ సీజన్, వీకెండ్ పార్టీ కల్చర్ కారణంగా హైదరాబాద్‌లోని మైక్రో బ్రేవరీల్లో బీర్ల అమ్మకాలు గతేడాది కంటే 30 నుంచి 35 శాతం పెరిగాయి. నగరంలోని జూబ్లీహిల్స్, గచ్చిబౌలి పరిసరాల్లోని బ్రేవరీలన్నీ పోటెత్తుతున్నాయి. రోజువారీ గరిష్ట ఉత్పత్తి పరిమితి 1000 లీటర్లు కాగా, వీకెండ్స్‌లో స్టాక్ మొత్తం ఖాళీ అవుతోంది.