MHBD: తొర్రూరు మండలంలో ఉన్న రెవెన్యూ గ్రామాలు, తండాల్లో చెరువులు, కుంటలను అక్రమణాల నుంచి పరిరక్షించాలని సేవలాల్ సేన మండల నాయకులు జాటోత్ సురేష్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, భూగర్భ జలాల పెరుగుదలకు ప్రధాన ఆధారమని, ప్రజలు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.