నారాయణపేట జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఎండ వేడిమితో ఇబ్బందులు పడిన ప్రజలకు వర్షం కారణంగా వాతావరణం చల్లబడింది. ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. అయితే నిరంతర వర్షం కారణంగా ఉద్యోగులు, పనులకు వెళ్లే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు రైతులకు మేలు చేస్తాయని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.