SRD: జిల్లాలో రోడ్లపై ధాన్యం ఆరబోస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. దీనివల్ల రాత్రి వేళల్లో వాహనాలు జారి ప్రాణాంతక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రైతులు ప్రభుత్వం సూచించిన కల్లాల్లోనే ధాన్యం ఆరబోసి, రోడ్డు భద్రతకు సహకరించి ప్రమాదాలను నివారించాలని కోరారు.