SDPT: రామారం IKP కేంద్రంలో మంగళవారం రాత్రి నుంచి కురిసిన అకాల వర్షం రైతులను తీవ్రంగా నష్టపరిచింది. కేంద్రంలో నిల్వ ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసిపోగా, భారీగా వర్షపు నీరుచేరి యార్డు జలమయంగా మారింది. ధాన్యాన్ని రక్షించేందుకు రైతులు వర్షంలోనే కాలువలు తవ్వినా ఫలితం లేకపోయిందని వాపోతున్నారు. తడిసిన వడ్లతో పెట్టుబడులు నీటిలో కలిసిపోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.