ASF: కాగజ్ నగర్లో యూరియా కొరత వల్ల ఎరువుల వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన రూ. 266 బస్తాను రూ. 340కి విక్రయించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాస్పల్లిలోని ఫర్టిలైజర్ దుకాణంలో ధరలపై రైతులు,యజమాని మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.