ASR: అనంతగిరి మండలంలోని కోనాపురం పంచాయతీ నుంచి కితలంగి, కరాయిగుడ మీదుగా అరకు మండలం లోతేరు మెయిన్‌రోడ్డు వరకు నిర్మించిన బీటీ రోడ్డు నాణ్యత లోపాలతో నిర్మాణ దశలోనే దెబ్బతింటోందని స్థానికులు ఆరోపించారు. కోట్ల రూపాయలతో నిర్మించిన రోడ్డు పూర్తై కొద్ది రోజుల్లోనే అంచులు చెదిరిపోవడం, పెచ్చులూడిపోవడంతో గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.