AP: తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 నిర్మాణంపై TTD దృష్టి సారిస్తోంది. ఏటేటా భక్తుల రాక పెరుగుతూ రద్దీ రోజుల్లో క్యూ కాంప్లెక్స్-1, 2లతో పాటు నారాయణగిరిలోని షెడ్లు నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 నిర్మాణం చేపట్టే యోచనలో అధికారులు ఉన్నారు. ప్రస్తుతం టీటీడీ అధికారులు ఈ అంశం స్పెషల్ ఫోకస్ పెట్టారు.