కరీంనగర్ 47వ డివిజన్లో ఓ కారు అదుపుతప్పి డ్రైనేజీలోకి దూసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు వెంటనే స్పందించి కారులోని వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.