GDWL: అయిజ మున్సిపాలిటీలోని పాత బస్టాండ్ వద్ద ఓ పానీపూరి బండి వద్ద తిన్న పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో విద్యార్థులు సహా సుమారు 15 మంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు. వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.