మెటా తన యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త ప్రయోగాలు చేస్తోంది. తాజాగా రెడ్డిట్ తరహాలో ఫోరమ్ అనే స్టాండలోన్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫేస్బుక్ గ్రూపులు, కమ్యూనిటీ యూజర్లే లక్ష్యంగా దీన్ని ప్రత్యేకంగా రూపొందించింది. నచ్చిన అంశాలపై చర్చించేందుకు ఈ యాప్ వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఫోరమ్ యాప్‌లోనూ లాగిన్ అవ్వొచ్చు.