AP: మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఈడీ విచారణకు హాజరయ్యారు. చెవిరెడ్డి భార్య, కుమారుడు ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. వారిద్దరి పేరిట జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఈ కేసుకు సంబంధించి చెవిరెడ్డి సహా పలువురు నిందితుల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది.