పెట్రోల్ ధరలు ఈనెల 15 నుంచి ఇప్పటివరకు లీటరుకు రూ.7.50 వరకు పెరిగాయి. దీంతో ప్రభుత్వ రంగ చమురు కంపెనీల నష్టాలు రోజుకు రూ.1,000 కోట్ల నుంచి రూ.600 కోట్లకు దిగొచ్చాయని పెట్రోలియం, సహజ వాయువు సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వెల్లడించారు. దేశీయంగా వంటగ్యాస్ విక్రయాల్లో కలుగుతున్న నష్టాలు కూడా ఇందులో కలిసే ఉన్నాయని చెప్పారు.