TG: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న సార్వత్రిక జీవిత బీమా పథకంపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ అమలుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయడం కోసం కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అయింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు ఉన్నతాధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.