SDPT: బెజ్జంకి పోలీసులు అక్రమ ఇసుక రవాణాపై చర్యలు చేపట్టి ఇద్దరిని పట్టుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఎలాంటి అనుమతులు లేకుండా రేణిగుంట నుంచి సిద్దిపేట వైపు ఇసుక తరలిస్తుండగా సోమరపేటకు చెందిన ఎర్ర దేవరాజు, వరికోలు గ్రామానికి చెందిన చామకూర రామకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్ శ్రీకాంత్ వారిపై బైండోవర్ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.