MDK: తూప్రాన్ పరిధి పోతరాజుపల్లి 8వ వార్డులో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. వీధులను శుభ్రం చేయడంతో పాటు, వీధిలైట్లకు మరమ్మతులను చేశారు. ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ ఛైర్ పర్సన్ బొంది రజని రాఘవేందర్ గౌడ్ సూచించారు. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో కౌన్సిలర్ బొడ్డు రాధా కుమారి శ్రీనివాస్, ఏఈ మధు పాల్గొన్నారు.